
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతే ధ్యేయంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు మరియు తొక్కిసలాట జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ కమిటీలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రథోత్సవాలు, వాహన సేవలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు మరియు సిసిటివిల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు.