
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
మహిళలు మరియు బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీస్ సహాయం అందించే శక్తి యాప్ వినియోగంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.పోలీస్ అధికారులు మహిళలకు శక్తి యాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు అయిన SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్, వెంటనే పోలీస్ రెస్పాన్స్ వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అదేవిధంగా, పాల్గొన్న వారందరికీ మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసి, నమోదు చేసుకునేలా ప్రాక్టికల్ డెమో కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహిళలు ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా శక్తి యాప్‌ను వినియోగించి తక్షణ సహాయం పొందాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరిగే నేరాలను తగ్గించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ప్రజలు కూడా ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని, తమ కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులకు శక్తి యాప్ గురించి తెలియజేయాలని కోరారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుండి పని చేస్తుందని భరోసా ఇచ్చారు.