
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సాంత్వన సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ కు సామాజిక పరివర్తన అవార్డు
మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఉభయ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు విభాగాల్లో విశిష్ట సేవలు అందజేసిన వారికి ఈ అవార్డు ప్రధానం చేశారు . ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సృజన్ మాదిగ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ అవార్డు ప్రతి సంవత్సరం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ మేయర్ గంగడసుజాత ,లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు.