
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
యం.ఆర్.మానవ హక్కుల సంఘం మరియు అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి,జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రొడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత, భారతరత్న అవార్డు గ్రహీత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భముగా యం.ఆర్.హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ వారు మార్కాపురం జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యములో పూలమాలలతో సత్కరించి, వారిని మననము చేసుకుంటూ, జోహార్లు అర్పించడము జరిగినది, ఈ కార్యక్రమమునకు జిల్లా చైర్మన్: డాక్టర్ ఎన్వి.బి.యల్. కిరణ్ కుమార్, హ్యూమన్ రైట్స్ ఏపి. స్టేట్ జనరల్ సెక్రటరి: కర్రా నాగిరెడ్డి, ఏపి. స్టేట్. చీప్ కన్వీనర్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, యర్రగొండపాలెం మండల ప్రెసిడెంట్ :కోలా శ్రీనివాసులు, మార్కాపురం మండలం: యం. శివప్రసాద్, సిద్ధం కృష్ణవేణి(జిల్లా మహిళా నాయకురాలు) జిల్లా సెక్రటరి: అల్లూరి యాదవ్, పోలయ్య గార్లు పాల్గొనడము జరిగినది.