
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:-
మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ (పిడి) గా ఎమ్ వి.మోహన్ రావు గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈయన నెల్లూరు జిల్లా హౌసింగ్ ఈఈ గా పనిచేస్తూ మార్కాపురం జిల్లాకు పిడిగా పదోన్నతి పై వచ్చారు.బాధ్యతలు స్వీకరించిన మోహన్ రావు కలెక్టర్ పి.రాజబాబు ను గురువారం కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పిడి మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల మేరకు నూతన జిల్లాలో గృహ నిర్మాణ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషి చేస్తానని అన్నారు.