
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యస్.సి సామాజికవర్గం నుండి మొట్ట మొదటి మహిళ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిణి శ్రీనివాస్ ని నియమించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అంతేగాక సామాజిక సమతుల్యతను పాటిస్తూ వైస్ చైర్మన్ గా పొట్టేళ్ల మురళీ యాదవ్ , డైరెక్టర్లు గా కొత్తూరు సుధాకర్ , చిరితోటి బాల కోటయ్యగారు, కడియాల సుబ్బారావు , కత్తి వెంకటేశ్వర్లు , షేక్ సుల్తానాబాషా గారు, అమ్మనబ్రోలు మాధవరావు , కూచిపూడి కరుణయ్య (బిజెపి), మేకల విజయ్ గారు, పోలుబోయిన రత్నకుమారి , దివి వెంకట శేషమ్మ , మాధవరపు రాధమ్మ , వక్కలగడ్డ మణికంఠ పవన్ కుమార్ (జనసేన), మాదాల వెంకటేశ్వర్లు తదితరులను నియమించి కొత్త సాంప్రదాయానికి తెరతీసి అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించిన ఘనత మన ఎమ్మెల్యే కే దక్కుతుంది. మార్కెట్ యార్డ్ కమిటీ పదవులు అంటేనే అవి కొంతమందికే పరిమితం అందరికీ అందని ద్రాక్ష వంటివి అనే సాంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు నియమించిన పాలక మండలి కమిటీని చూసి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతోపాటు మరి ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తూ…