
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉండాలి: జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు .ప్రకాశం భవనంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులకు, రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.