
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళలపై నేరాల నిరోధం, అలాగే సైబర్ క్రైమ్ ముప్పులపై ప్రకాశం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించుకోవచ్చో వివరించడంతో పాటు డ్రగ్స్ వాడకంతో కలిగే శారీరక–మానసిక నష్టాలను వివరించారు. మహిళల భద్రత, డయల్ 100 మహిళ వంటి పోలీస్ సేవల గురించి సమాచారాన్ని అందించారు.ఇటీవల పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, ఫేక్ లింకులు వంటి సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలనే దానిపై ప్రజలకు సూచనలు చేశారు. అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు.ప్రజలు భద్రత కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.