
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పులిపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చే నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో గస్తీ, వాహన తనిఖీలు నిర్వహించి, శాంతి భద్రతా పరిస్థితులను పర్యవేక్షించారు.భక్తులు శాంతియుతంగా, నియమ నిబంధనలు పాటిస్తూ ఆలయ దర్శనాలు చేయాలని పోలీసులు సూచించారు.జిల్లాలో ప్రజల భద్రత, సామాజిక శాంతి కోసం ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.