
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరుకి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ని స్కంధపురి పురి సేవా సమితి, చైర్మన్ పువ్వాడి మౌనిక, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు లోని టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో స్కంధపురి సేవా సమితి, సౌజన్యంతో ఏర్పాటు చేసిన మియావాకి వనం గురించి వివరించడమే కాకుండా దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలో రెండు ఎకరాల స్థలంలో, 84 రకాల కు చెందిన 3200 మొక్కలు నాటినట్లు ముఖ్యమంత్రి కి మౌనిక వివరించారు. ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆసక్తిగా చొరవతో వినడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలను ఇతర చోట్ల కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మియావాకి వనం ఏర్పాటు చేయడంలో సహకారం అందించిన,గౌరవ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు కి మరియు ఇతర నాయకులందరికీ పువ్వాడి మౌనిక ధన్యవాదాలు తెలియజేశారు.