
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు మండలం, కోవూరు గ్రామానికి చెందిన పేద రైతు చుంచు రాంబాబు బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పటికే వైద్యం కోసం 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న రాంబాబు… ఆర్థిక స్థోమత లేక తదుపరి చికిత్స కోసం నన్ను కలిశారు.ఆయన పరిస్థితిని వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి, LOC (Letter of Credit) ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయించాను. ప్రస్తుతం ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఎందరో పేదలకు CM రిలీఫ్ ఫండ్ నిజంగా ఒక వరం. ఆపదలో ఉన్న కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కి హృదయపూర్వక కృతజ్ఞతలు