
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఇంటి పన్నుల (హౌస్ ట్యాక్స్) వసూలు కార్యక్రమాన్ని ఒంగోలు డివిజినల్ పంచాయతీ అధికారి ఆర్. పద్మ సందర్శించి పరిశీలించారు. పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు పరిస్థితి, రికార్డులు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను ఆమె పరిశీలించారు.
గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలుకావాలంటే ప్రజలు ఇంటి పన్నులు సమయానికి చెల్లించాలని ఆమె సూచించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని పంచాయతీ సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మూలగుంటపాడు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.