
తొలి శుభోదయం ప్రకాశం:-
ఈనెల 13వ తారీఖున జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులతోపాటుగా బ్యాంకు మున్సిపాలిటీ రెవెన్యూ కు సంబంధించిన కేసులను ఎక్కువగా పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలని ఈరోజు కందుకూర్ సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎం శోభ కందుకూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మరియు డివిజన్ పోలీసులతో సమావేశమై మాట్లాడారు. భారత అత్యున్నత న్యాయస్థానం రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవటాన్ని రాజమార్గంగానే పరిగణిస్తుందని కక్షిదారులకు ఈ విషయాలను తెలియపరచి వివాదాలు పరిష్కరించుకోటానికి న్యాయవాదులు పోలీసులు తగిన కృషి చేయాలని అన్నారు.సివిల్ ధావాలతో పాటు క్రిమినల్ కేసులు కూడా రాజీ పడవచ్చు.
అడిషనల్ మున్సిప్ మెజిస్టేట్ నిఖిల్ రెడ్డి అడిషనల్ మున్సిపల్ మెజిస్టేట్ నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ సివిల్ ధావాలతోపాటు ఇరు పార్టీలు రాజీపడి క్రిమినల్ కేసులను కూడా ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. కేసులను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే కక్షిదారులకు అంత ఉపశమనం త్వరగా లభిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో గుడ్లూరు మరియు కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీధర్ నాయుడు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బెజవాడ కృష్ణయ్య, న్యాయవాదులు టీ తిరుమలరావు, బివి మురళీకృష్ణ, బి సాయి శంకర్, ఎస్ పవన్ కుమార్, ఎస్. కె సంషుద్దీన్, ఏ.వి సుబ్బరామయ్య, వై ఎలమందరావు, పి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.