
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మే 1 న నిర్వహించే మేడేను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై. ఆనందమోహన్, సిపిఐ కౌన్సిల్ సభ్యులు ఉప్పుటూరి మాధవరావు లు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాలు తీసుకొని వచ్చి కార్మికుల కష్టాలు తీర్చిన రోజును మేడేగా జరుపుకుంటామని వారు తెలిపారు.కార్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా మేడే నిర్వహించటం జరుగుతుందని, మేడే రోజున జరిగే కార్యక్రమాలకు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కార్మిక శక్తి ఏమిటో అర్థమయ్యేలా కార్మికులు మే డే నిర్వహించబోతున్నారని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భాష, మతం సామాజిక వర్గం, దేశం, రాష్ట్రం తారతమ్యం లేకుండా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మే1న ఘనంగా కార్మిక లోకం నిర్వహించనుందని తెలిపారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల కోసం కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. మేడే సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో అన్నిచోట్ల ఆయా ప్రాంతాల్లో ఏఐటియుసి జండా ఆవిష్కరణ జరుగుతుందని అన్ని వర్గాల, అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.