
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
సీఐటీయూ కనిగిరి మండల కమిటి సమావేశం మండల కన్వీనర్ పి నరేంద్ర అధ్యక్షతన మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మే డే స్ఫూర్తితో ముందుకు సాగి రాబోవుకాలంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని తెలిపారు. మే డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అన్నారు. ఐక్య పోరాటాలు ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లొ దేవదానం, బాలస్వామి, మార్క్, ప్రసాద్, అడివయ్య, రహమాన్,వెంకటేశ్వర్లు, పద్మ, సౌభాగ్యం, రమాదేవి,శాంతకుమారి, ప్రమీల, రోజమ్మ తదితరులు పాల్గొన్నారు