
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. సూచనల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మైనర్ రైడర్స్‌పై ప్రత్యేక అవగాహన మరియు కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ట్రాఫిక్ సీఐలు పాల్గొని, బాల్య వయస్సులో వాహనాలు నడపడం వల్ల వచ్చే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు, అలాగే కుటుంబాలపై పడే ప్రభావం గురించి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు వివరించారు.కౌన్సెలింగ్‌లో ముఖ్యాంశాలు: మైనర్ రైడింగ్ వల్ల జరిగే ప్రాణాపాయాలు, రోడ్డు ప్రమాదాల గణాంకాలు వాహనం ఇచ్చే తల్లిదండ్రుల బాధ్యత, లీగల్ లయబిలిటీ
హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఉండే రిస్క్పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పట్ల అవగాహనభవిష్యత్తులో మైనర్ రైడింగ్ జరగకూడదనే ప్రతిజ్ఞజిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, రోడ్డు భద్రత విషయం లో ప్రజలు తప్పక సహకరించాలని పోలీసులు తెలిపారు.