
తొలి శుభోదయం:-
మొంథా తుఫాను నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఉలవపాడు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు సహాయ, సహకారాలను అందించారు. వారు తుఫాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పునరావాసితులకు అందుతున్న ఆహారం త్రాగునీరు మొదలగువాటిని అందించడంలో ప్రభుత్వ ఏర్పాట్లపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా, నాయకులు కరేడు పంచాయతీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలిస్తున్నారని నాయకులు తెలిపారు. తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి తక్షణ సహాయం అందించేందుకు టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని, బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.