
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది గంగపాలెం గ్రామ పొలాల్లో జరుగుతున్న జూద స్థావరం పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో 2 మంది జూదగాళ్లను పట్టుకుని వారి వద్ద నుండి ₹1,600/- నగదు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులపై సంబంధిత చట్టపరమైన కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.ప్రజలకు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, జూదం వంటి అక్రమ చర్యలు సమాజంలో చెడు ప్రభావం కలిగిస్తాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇలాంటి సమాచారం ఎవరైనా అందించినట్లయితే వారి వివరాలను గోప్యంగా ఉంచి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.