
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న జూద కార్యకలాపాలపై పోలీసులు అకస్మాత్తుగా దాడి నిర్వహించారు.
దాడిలో 7 మంది జూదగాళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ₹5,300/- నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పోలీసు అధికారులు మాట్లాడుతూ జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాలను, సమాజాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ చర్యలు ఎక్కడైనా జరుగుతున్నట్లు ఎవరైనా సమాచారం అందించినట్లయితే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.