
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , కన్సల్టెన్సీ శ్రీనివాస్ రెడ్డి, దర్శి మెప్మా అధికారి కె. రఘు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.యువతకు ఆదర్శంగా ఉన్న లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారని, ప్రతి అడుగు అదే దిశగా సాగుతోందని చెప్పారు.గత ఐదేళ్లలో వెనుకబడిన పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తూ, టెక్నాలజీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ, గూగుల్, ఏఐ వంటి సంస్థలను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.మెగా డీఎస్సీ ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులను నియమించామని, త్వరలో మరో డీఎస్సీ ప్రకటించనున్నామని తెలిపారు.దర్శి నియోజకవర్గంలో యువత భవిష్యత్తు బాధ్యతగా తీసుకుని జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు 2000 మందికి పైగా యువతకు అవకాశాలు కల్పించి, 500 మందికి పైగా ఉద్యోగాలు అందించామని వెల్లడించారు.ఐదోసారి నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 162 మంది పాల్గొనగా, ప్రతి ఒక్కరికి ఆఫర్ లెటర్లు అందజేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.చదువు పూర్తయ్యాక ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలవాలని యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి యువతీ–యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, టిడిపి నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
