
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిముల పవిత్ర, పుణ్యాల రంజాన్ మాసం సందర్భంగా పేదవారు పండుగ సుఖ,సంతోషాలతో జరుపుకోవాలని దాతల నుండి సేకరించిన విరాళాల ద్వారా 50 మంది నిరుపేదలకి బియ్యంతో పాటు 18 రకాల నిత్యవసర సరుకుల రంజాన్ తోఫా కిట్ల మొదటి విడత పంపిణీ కార్యక్రమం ప్రముఖ ప్రసూతి మరియు గర్భకోశ వైద్యనిపుణులు డాక్టర్ ఎ.అదిలాబాను ఇక్బాల్, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా మానవతాదృక్పథంతో ఒంగోలు,కందుకూరు, ఉలవపాడు, సింగరాయకొండ పట్టణా లల్లో కులమతాలకతీతంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అయిన పేదవారికి విద్య, వైద్యం, ఆర్ధికపరంగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న ఐఎస్సి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ తనని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాజిద్, సెక్రటరీ షంషేర్, ట్రజరర్ హాఫీజ్, ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, అన్సర్, షమ్ షూద్దీన్ పాల్గొన్నారు.