
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ముస్లిం సోదర, సోదరీమణులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ & YSRCP బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు తూమాటి మాధవ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేచేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, నెలవంకతో ప్రారంభమయ్యే ఈ పవిత్ర కాలం ఈద్ ఉల్ ఫితర్ పండుగతో ముగుస్తుందని అన్నారు. ఈ రంజాన్ పండుగ అందరు ముస్లిం కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు ఆకాంక్షించారు.