
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పండుగ వేళ ప్రజలు శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని, ఎలాంటి అపోహలు, వివాదాలు తలెత్తకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. మత పెద్దలు కూడా పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొల్పేందుకు కృషి చేయాలని అధికారులు కోరారు.పండుగ రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలందరూ శాంతి, సహనం పాటిస్తూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.