
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభంలో రంజాన్ ప్రార్థనల సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ లు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ ప్రార్ధనల సందర్భంగా ఈద్గా వద్ద, మసీదుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ, మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఎస్సై, శివ కృష్ణారెడ్డి తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఈద్గా మైదానంలో ప్రార్థనల అనంతరం పోలీసు శాఖ వారు ముస్లిం సోదరులకు డ్రై ఫ్రూట్స్, జ్యూస్ లను పంపిణీ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు….