
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు రాబోయే రథోత్సవం పండుగను శాంతియుతంగా, సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో పొదిలి సీఐ ఆదివారం పొదిలి పోలీస్ స్టేషన్ను సందర్శించారు.ఈ సందర్భంగా సీఐ రాడోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలు, ఆలయ పరిసరాలు, రథయాత్ర మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం రథోత్సవం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, పండుగ నిర్వహణలో పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, జన నియంత్రణ చర్యలు అమలు చేయాలని సీఐ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తర్లుపాడు ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది మరియు రథోత్సవం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
