
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కందుకూరు రూరల్ సర్కిల్ సీఐ పర్యవేక్షణలో, జాతీయ రహదారి (NH-16) నార్త్ బైపాస్ వద్ద మరియు NH-167B కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్రోచ్ రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్లకు ఎమల్షన్ పెయింటింగ్ వేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు.రాత్రి సమయాల్లో వాహన చోదకులకు స్పీడ్ బ్రేకర్లు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు, విజిబిలిటీ (Visibility) పెంచడానికి రేడియం పెయింటింగ్‌ను వేయించారు.కందుకూరు రూరల్ సీఐ గారు స్వయంగా ఈ పనులను పర్యవేక్షించి, జాతీయ రహదారులకు కలిసే అప్రోచ్ రోడ్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని తెలిపారు.బ్లాక్ స్పాట్స్ (ప్రమాదాలు జరిగే ప్రాంతాలు) వద్ద హెచ్చరిక బోర్డులు, పెయింటింగ్ పనులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.