
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో, పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులపై రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.నైట్ బీట్లో భాగంగా పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ, వారి వివరాలను సాంకేతిక పద్ధతులతో పరిశీలిస్తున్నారు. అలాగే మూసివేసిన ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరంతర పహారా నిర్వహిస్తూ చోరీలకు చెక్ పెడుతున్నారు.విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సహకారంతో నేరాలకు తావులేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.