
తొలి శుభోదయంన్యూస్ ఉలవపాడు:-
గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీలోని కర్లపాలెం భూనిర్వాసితుల కోసం కొత్తగా నిర్మించబోయే ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతుల నిర్మాణాలకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. 371 మంది గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ రాజాబాబు, మారిటైమ్ బోర్డు సీఈవో అభిషేక్ కుమార్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం, రామాయపట్నం పోర్టు గురించి అసలు పట్టించుకోలేదని, కేవలం వారి అవసరాల కోసమే హడావుడి చేశారని అన్నారు. ఆ పార్టీ నేతలు కోర్టులో కేసులు వేసిన కారణంగానే పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వచ్చామన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో 75 శాతం పనులను పూర్తి చేసిందని, మిగిలిన 20 శాతం పనులను ఏడాది చివరికల్లా పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.