
తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:-
శ్రీరామనవమి పండుగ సందర్భంగా…. మద్దిపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రామాలయంలో పలువురు ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాన్యూస్ ఛానల్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ ఆహ్వానంతో…. మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు నేతలకు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలుకగా… నేతలందరినీ మారెళ్ళ వంశీకృష్ణ సత్కరించారు.