
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో 2026 ఫలితాలలో అటు రాష్ట్రస్థాయిలోను ఇటు జిల్లా స్థాయిలోను గిద్దలూరు విద్యార్థులు విజయ దుందుభి మోగించారు.
పర్యావరణము- సుస్థిరాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మూఢనమ్మకాలు- శాస్త్రీయ దృక్పథం మొదలైన వాటిపై 8,9,10 తరగతి చదివే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేయండి. వీడియో తీయండి. విజేతలు కండి. అనే పిలుపుకు స్పందించి లో కాస్ట్ నో కాస్ట్ ప్రయోగాలలో అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
సూర్య విద్యానికేతన్ చెందిన డి. సమీరా, జి రమ్యశ్రీ మూఢనమ్మకాలు శాస్త్రీయ దృక్పథం అనే అంశంలో రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.జిల్లా స్థాయిలో స్ప్రింగ్ బోర్డు స్కూల్ కు చెందిన ముప్పూరి సాయి హర్షిత "పర్యావరణం -సుస్థిరాభివృద్ధి" అనే అంశంలో ప్రకాశం జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించారు.అరుణోదయ స్కూల్ కు చెందిన జెడ్. భూమిక, టి.ప్రీతి, కె. కార్తీక్, "సైన్స్ అండ్ టెక్నాలజీ"లో ప్రకాశం జిల్లాలో ద్వితీయ స్థానాన్ని పొందారు. "పర్యావరణము- సుస్థిరాభివృద్ధి" అనే అంశంలో అరుణోదయ స్కూల్ కు చెందిన సి.హెచ్. జశ్విత, యు.జి. అలేఖ్య ప్రకాశం జిల్లాలో ద్వితీయ స్థానాన్ని సాధించారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పి.స్వరూప రెడ్డి మాట్లాడుతూ సైన్స్ యురేకా వంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతను శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీయడానికి అద్భుతమైన వేదిక అన్నారు. 29 జిల్లాల నుండి వందలాదిమంది విద్యార్థు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనే స్థాయికి ఎదగాలన్నారు. ఒక ప్రయోగాన్ని సొంతంగా చేయడం వల్ల అందులోని భౌతిక రసాయనిక సూత్రాలపై వారికి లోతైన అవగాహన ఏర్పడుతుందన్నారు. జన విజ్ఞాన వేదిక గిద్దలూరు డివిజన్ నాయకుడు డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా విషయాన్ని ప్రశ్నించడం పరిశీలించడం మరియు విశ్లేషించడం వంటి నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల వారిలో శాస్త్రీయ దృక్పథం పెరుగుతుంది అన్నారు . సైన్సు యురేకా ఫలితాలు కేవలం మార్కులు బహుమతులకు సంబంధించిన కావని ఇవి దేశ భవిష్యత్తుకు పునాదులైన బాల శాస్త్రవేత్తల మేధస్సుకు నిదర్శనం అన్నారు.
సూర్య విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయులు డి.జి. బ్రహ్మానంద రెడ్డి, అరుణోదయ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జింకా చంద్రశేఖర్, స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ ప్రిన్సిపాల్ జె. శ్వేత మాట్లాడుతూ విద్యార్థి అభివృద్ధే పాఠశాల అభివృద్ధి అని రాష్ట్రస్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి విజేతలను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, యురేకా సైన్స్ ఎక్స్పో టెక్నికల్ బాధ్యులు జి మహేష్, రాష్ట్ర విద్య సబ్ కమిటీ కన్వీనర్ గొంటి గిరిధర్ న్యాయ నిర్ణేతలు ఎమ్.ఎస్. యుగంధర్ బాబు, ఎస్కే జిలాని భాష రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులు సిహెచ్ జయప్రకాష్, శోభన్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు యు. వెంకట్రావ్ జి.శ్రీనివాస రెడ్డి, ఎం. శ్రీనివాసులు, ఎ.విశ్వరూపాచారి, కె. రాజా ,పి అల్లూరయ్య, బి ఈశ్వర్ కుమార్ అభినందనలు తెలిపారు.