
సీఎం చంద్రబాబు నాయకత్వం, విజన్ తో రాష్ట్రానికి భద్రత
ప్రధాని నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు.
తొలి శుభోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం రాష్ట్రానికి మరువలేని రోజని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి అవిరళ కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు గారి విజన్‌తో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి లక్ష్య సాధనలో యువ నాయకుడిగా నారా లోకేష్ చూపుతున్న చొరవ, పట్టుదల హర్షించదగ్గ విషయమని చెప్పారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్… మన రాజధాని అమరావతి అని గర్వంగా చాటాలన్నారు. అమరావతి కోసం దీర్ఘకాలంగా పోరాడిన రైతుల త్యాగాలు ఇందుకు ప్రధాన కారణమని, ఈ చట్టబద్ధతతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆమె ఆకాంక్షించారు.