
అమరావతి మహిళలపై అక్రమ కేసులు మోపి హింసించిన పాపం జగన్ కి ఊరికే పోదు
ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పినా అమరావతిపై వైసీపీ విషం చిమ్మడం మానలేదు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దతతో కొండపిలో మంత్రి డా.స్వామి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
ఒంగోలులో జిల్లా ప్రజా ప్రతినిధులతో కలసి అమరావతికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న మంత్రి డా. స్వామి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / కొండపి/ ఒంగోలు :-
ఆంధ్రుల కలల రాజధాని ఎన్నటికీ అమరావతేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం
పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదంతో కొండపిలో మంత్రి డా.స్వామి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాత్రి ఒంగోలులో జిల్లా ప్రజా ప్రతినిధులతో కలసి అమరావతికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో మంత్రి డా. స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….నేడు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. అమరావతి చట్ట బద్ధతకు కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు. ఆంధ్రుల రాజధాని ఇక ఎన్నటికీ అమరావతే.
అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. అమరావతిపై చర్చ సమయంలో వైసీపీ ఎంపీలు సభను బాయికాట్ చేయడం వారి దుర్బుద్ధికి అద్దం పడుతోంది. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ కుట్రలు పన్నారు. నాడు జగన్ అమరావతి మహిళలపై అక్రమ కేసులు మోపి హింసించారు. ఈ పాపం జగన్ కి ఊరికే పోదు. ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పినా అమరావతిపై వైసీపీ విషం చిమ్మడం మానలేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు.