
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
పొరుగు రాష్ట్రాల తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో జర్నలిస్ట్ కుటుంబ సంక్షేమం కోసం పింఛను ప్రవేశపెట్టాలని రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేయ్యాలని పూర్వ జర్నలిస్ట్ చిత్తూరుజిల్లా పూతల పట్టు శాసన సభ్యుడు కలికిరి మురళీమోహన్ కి రాష్ట్ర జర్నలిస్ట్ కుటుంబాలు, వెటరన్ జర్నలిస్ట్ కుటుంబాల పక్షాన సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ డా పెట్లూరి వేంకటేశ్వర రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఆయన రాష్ట్ర జర్నలిస్ట్ కుటుంబాల పక్షాన స్పందించి జర్నలిస్ట్ సమస్యలపై ప్రస్తావించడం చాలా సంతోషం కలిగించిందన్నారు. దశాబ్దాల కాలంగా జర్నలిస్ట్ పింఛన్ పథకాన్ని అమలు చేయాలని పొరుగు రాష్ట్రాల తరహాలో చర్యలు చేపట్టి అమలు చెయ్యాలని ప్రభుత్వాన్ని, డిమాండ్ చేస్తూ మాజీ కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి,రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,మాజీ సమాచార శాఖ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పూర్వ జర్నలిస్ట్ కాల్వ శ్రీనివాసులు తోపాటు నేటి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలను పార్థ సారధి లకు ప్రత్యక్షంగా, వాట్సప్ గ్రూప్ ద్వారా పలు మార్లు జర్నలిస్ట్ వినతి పత్రాలు సమర్పించామని ఆయన గుర్తు చేశారు. ఇంత కాలానికి పూర్వ జర్నలిస్ట్ పూతల పట్టు శాసన సభ్యుడు కలికిరి మురళీమోహన్ రాష్ట్ర శాసన సభ లో ఈ సమస్య తో పాటు జర్నలిస్ట్ కుటుంబాల సంక్షేమం గురించి ప్రస్తావించడం జర్నలిస్ట్ లకు నైతిక బలాన్ని ఇచ్చిందన్నారు. జర్నలిస్ట్ కుటుంబ సభ్యుల మనుగడకు ఒక అడుగు ముందుకు పడిందని ఆయన అభిప్రాయ పడ్డారు. జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలపాలని కోరారు.
