
తొలి శుభోదయం సింగరాయకొండ:-
రాష్ట్ర స్థాయి లో క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రకాశం జిల్లా తీర ప్రాంత సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( ప్లస్2) విద్యార్థినులు కబడి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ 19 సంవత్సరాల లోపు బాల బాలికలకు కబాడి పోటీ ఎంపిక నిర్వహించారు. పాకల ఉన్నత పాఠశాల అంటే నే వాలీబాల్ క్రీడ గుర్తుకు వస్తుంది. అలాంటి పాఠశాల లో కొంత కాలంగా ఆ ప్రతిష్టాత్మకమైన క్రీడ స్థానం లో కబాడి క్రీడ పట్ల క్రీడాకారులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.దానితో పెరిగిన ఆసక్తి కబాడి
క్రీడా కారులు నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొంటున్నారు. ఈ నేపద్యం లో 19 సంవత్సరాల లోపు బాల బాలికలకు పాఠశాల స్థాయి లో వ్యాయామ ఉపాధ్యాయుడు కోటేశ్వర రావు, వంశీ లు తర్ఫీదు ఇచ్చారు. దానితో జిల్లా స్థాయిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడాకారుల ఎంపికలో పాకల ప్లస్ టు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు స్వాతి, నందిని,సిపోర, త్రిగుణ లు విజయం సాధించారు. ఈ పాఠశాల నుండి కబాడి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పాఠశాల తో పాటు గ్రామ పంచాయతీ కి ఆనందదాయకం అని వ్యాయామ ఉపాధ్యాయుడు కోటేశ్వర రావు ఆనందం వ్యక్తం చేశారు. సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ 19 సంవత్సరాల లోపు బాల బాలికల కబడ్డీ పోటీలలో పాకల నుండి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు డి.వి.ఎస్. ప్రసాద్ మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.