
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ వారియర్స్ మరియు స్పెషల్ పార్టీతో కలిసి విస్తృత స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన రహదారులు మరియు పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.డ్రైవ్ సమయంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులు, అధిక వేగం, తప్పుదారి ప్రయాణం వంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే జరిగే ప్రమాదాలు, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో పోలీస్ అధికారులు స్పష్టంగా వివరించారు.ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం తగిన చలాన్లు విధించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరియు ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు. ప్రతి వాహనదారు బాధ్యతతో వాహనం నడిపి, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.