
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు మరియు అమలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాహనాలపై అనధికారంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) LED లైట్ల వల్ల ఇతర వాహనదారులకు గందరగోళం ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.పోలీసులు రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తూ అనధికార LED లైట్లు అమర్చిన వాహనాలను గుర్తించి వాటిని తొలగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, వాహనదారులు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసులకు సహకరించి సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలని కోరారు.