
తొలి శుభోదయం ప్రకాశం:-
రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త కారణంగా బస్సులు, ఇతర వాహనాలు రోడ్డుపైనే ఆగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలకు అవకాశం ఉన్న మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రోత్ సెంటర్ (బ్లాక్ స్పాట్) ప్రాంతంలో, జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలన చేసి తక్షణ చర్యలు చేపట్టడంతో ప్రమాదాల నివారణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రోత్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న మహిళలు, పురుషులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి వెళ్లే సమయంలో రోడ్డుపైనే నిలబడి బస్సులు ఎక్కడం, బస్సులు కూడా రోడ్డుపైనే ఆగడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని గమనించారు. అక్కడ ప్రయాణికులు కూడా సమస్యను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని వచ్చారు.ఆర్టీసి అధికారులతో మాట్లాడి.. బస్సును మార్జిన్ లో అపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మార్జిన్లో చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల వాహనాలు అక్కడ నిలపలేక రోడ్డుపైనే ఆగాల్సి వస్తోందని జిల్లా ఎస్పీ గుర్తించారు. ఈ పరిస్థితి వలన ప్రయాణికులకు, వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశముందని సంబంధిత పోలీస్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు మరియు మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య వెంటనే స్పందించి, జెసిబిల సహాయంతో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించారు. శుభ్రం చేసిన ప్రదేశంలో ఇకపై చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అక్కడ ఉన్న షాపులు వాళ్లకు అవగాహన కల్పించడంతో పాటు, అక్కడ చెత్త వేయకుండా పలు సూచనలు చేశారు.చెత్త తొలగించిన అనంతరం, ఆ ప్రాంతాన్ని బస్సులు మరియు ఇతర వాహనాలు సురక్షితంగా ఆగేందుకు అనుకూలంగా ఉంది. ఇకపై బస్సులు సర్వీస్ రోడ్లలో ఆగే విధంగా, ప్రయాణికులు రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా బస్సు ఎక్కే విధంగా, దిగే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం తగ్గడంతో పాటు, ప్రమాదాల అవకాశాలు కూడా గణనయంగా తగ్గుతుంది.జిల్లా ఎస్పీ చొరవతో చేపట్టిన ఈ చర్యల వల్ల ఆ ప్రాంతంలో పనిచేసే కార్మికులు, ప్రయాణికులు, వాహనదారులు సురక్షితంగా రాకపోకలు సాగించగలుగుతారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.