
వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
మద్యం సేవించి, అతివేగంగా వాహనాలు నడపరాదు.
మొబైల్ ఫోన్ ఉపయోగించకూడ.. సురక్షితంగా వాహనం నడపాలి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించి, పాదచారులు, వృద్దులకు, పిల్లల భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి.
మీ భద్రతతోపాటు ఇతరుల భద్రతను మీ భద్రతగా గుర్తించి ఎల్లప్పుడూ రోడ్డు భద్రత ను పాటించాలి.
ప్రజలలో మార్పు వచ్చినప్పుడే రోడ్డు ప్రమాదాలు ఖచ్చితంగా నివారించవచ్చని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్,. అన్నారు.
తొలి శుభోదయం ప్రకాశం:-
37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా వివిధ కాలేజీ విద్యార్థులతో కలిసి జిల్లా పోలీసులు కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ గారు రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రతిజ్ఞ చేయించి అక్కడ నుండి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు పోలీసు అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… ప్రతి రోజు జిల్లా, రాష్ట్ర, దేశ వ్యాప్తంగా రోడ్డు యాక్సిడెంట్ వలన చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు.
ఎంతో మంది కుటుంబాలలో కుటుంబ పెద్దలు, పిల్లలు మరణించటం చాలా బాధించతగ్గ విషయమన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ట్రాఫిక్ పట్ల ఎప్పుడూ ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉంటారో.. అప్పుడే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చారు.
తల్లిదండ్రులు మీ పై ప్రేమతో వాహనాలు కొనిస్తారని… వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడిపితే… ఎదైన ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో భయటపడవచ్చన్నారు.
యువకులు ఉత్సాహం తో రోడ్డు పై వాహనాలు వేగంగా నడిపి యాక్సిడెంట్ కు గురవుతున్నారని ఎస్పీ గారు ఒక్కింత అవేదన వ్యక్తం చేశారు.కన్నబిడ్డులు రోడ్డు ప్రమాదాలలో మృతిచెందారని ఆ కుటుంబ సభ్యులకు తెలిస్తే… ఆ కన్న పేగు పడెభాద ఎవరు తీర్చలేరన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొవాలన్నారు.ఇక్కడ కువచ్చిన ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలపై మీ సహచర స్నేహితులకు చెప్పి రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.మనతోపాటు మన వల్లన ఎవరికి ప్రమాదం జరగకుండా చూడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు.ద్విచక్ర వాహనాలు నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించాలని.. అదేవిధంగా కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని మీతోపాటు మరో పది మంది చెప్పాలని యువకులతో ఎస్పీ గారు ప్రతిజ్ఞ చేయించారు.ఇదిలా ఉంటే గత మూడు నెలల నుండి ప్రకాశం, మార్కాపురం జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రత్యేక చర్యలు చెపట్టాము.గ్రామ రోడ్డుల నుండి రాష్ట్ర, జాతీయ రోడ్డు పైకి వస్తున్న సమయంలో అ ప్రదేశం లో స్పీడ్ బ్రేకర్స్ తోపాటు మీర్రర్స్ ను ఎర్పాటు చేయడం జరిగింది.రోడ్డు ప్రమాదాల నివారణకు భాద్యతతో కూడిన పోరాటం లాగా చేస్తే… రోడ్డు ప్రమాదాలు శాతం తగ్గించవచ్చన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు సేఫ్టీ వారియర్స్ కూడా ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ జగదీష్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ఒంగోలు రూరల్ సీఐ ఎన్ శ్రీకాంత్ బాబు, ఆర్ ఐ రమణారెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
