
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో మెగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా బస్సుల డాక్యుమెంట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు మరియు ఇతర చట్టబద్ధ పత్రాలను సవివరంగా పరిశీలించారు.ప్రత్యేకంగా డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు ఉన్నాయా లేదా అన్నదానిపై కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.ఈ డ్రైవ్ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం మరియు ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజల ప్రాణ భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.