
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని స్థానిక మహిళలు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నామని గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు నిర్మాణానికి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము ఫ్లాట్లు వేస్తున్నాము ఇది మా స్థలం అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని వారు వాపోయారు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వచ్చి మా పనులకు అడ్డం వస్తే మీ ఇల్లు మొత్తం ఖాళీ చేయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సిబిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే వీరారెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివాసముంటున్న నిరుపేదల కుటుంబాలను బెదిరించటం సరైనది కాదని వారు హెచ్చరించారు. నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సదుపాయం ఉందని అలాంటి సందర్భంలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి దౌర్జన్యానికి దిగుతుంటే మున్సిపల్ అధికారులు వారికి మద్దతు పలుకుతూ నిరుపేదల కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయటం సరైనది కాదని వారు అన్నారు. ప్రైవేటు వ్యక్తుల స్థలమైతే అప్పటి టిడిపి ప్రభుత్వం రోడ్డు నిర్మాణం పనులు ఎలా చేపట్టిందని అప్పటి మున్సిపల్ కమిషనర్ గా ప్రస్తుతం పని చేస్తున్న మున్సిపల్ కమిషనరే బాధ్యతలు చేపట్టారని అలాంటి సందర్భంలో ప్రైవేటు వ్యక్తుల దౌర్జన్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్న ఆ దిశగా కమిషనర్ చర్యలు చేపట్టకపోవడం దారుణమని వారు ఆరోపించారు. రోడ్డు సమస్యను సంబంధిత ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించుకుంటామని వారు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న దౌర్జన్యాలను అధికారులు అరికట్టకపోతే ఉద్యమ బాట పట్టడం జరుగుతుందని వారు హెచ్చరించారు