
రాష్ట్రం కోసం ఆయన పడుతున్న తపనకు హాట్సాఫ్
అభివృద్ధిలో లోకేష్ బాబు నిరంతర శ్రామికుడు
TDP కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు
ఎమ్మెల్యే ఇంటూరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్
భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు, కార్యకర్తలు
తొలి శుభోదయం కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ యువకిశోరం, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు వేడుకలను కందుకూరులోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కేక్ కట్ చేసి లోకేష్ బాబు కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజవర్గం అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, లోకేష్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో
రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలన్నదే పార్టీలో అందరి కోరిక అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఎంతోమందికి రాజకీయంగా అవకాశం కల్పించి, తనతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు కావడానికి కారణం లోకేష్ గారని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. గెలిచినప్పటి నుంచి తమను సొంత అన్నదమ్ముల్లాగా చూసుకుంటున్నారని నాగేశ్వరరావు చెప్పారు.అడగగానే అపాయింట్మెంట్ ఇవ్వడం, చిన్న మెసేజ్ చేసినా వెంటనే స్పందించటం లోకేష్ కు ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. అభివృద్ధి పనులు కోసం అడగ్గానే నిధులు మంజూరు చేసి పెద్దమనసు చాటుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దక్కని ఎమ్మెల్యేలను మన ప్రాంతంలోనే చూశామని నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకోకుండా, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలన్న ఆలోచనతో విదేశీ పర్యటనలో బిజీగా తిరుగుతున్న యువ దార్శనికుడు లోకేష్ అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు. తన రాజకీయ ప్రయాణం లోకేష్ వెంటనే సాగుతుందని, ఆయన సారథ్యంలో కందుకూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు. నారా లోకేష్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, రాష్ట్ర APEWIDC కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదరవాడ కొండయ్య, షేక్ రూబీ, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, నాదెళ్ల వెంకట రమణయ్య, అల్లం వెంకటేశ్వర్లు, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, షేక్ మున్నా, షేక్ సలాం, ముచ్చు శ్రీను, కొత్తూరి సుధాకర్ మురారి శెట్టి సుదీర్, మురారిశెట్టి శ్రీకాంత్, మరియు నియోజకవర్గంలోని అనుబంధ సంఘాల అధ్యక్షులు వార్డు, గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
