
తొలి శుభోదయం ప్రకాశం:-
భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన దేశభక్తి గీతం “వందే మాతరం” రచించబడిన 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల చేతుల్లో జాతీయ పతాకాలు, “వందే మాతరం” నినాదాలు, దేశభక్తి గీతాల మేళం మధ్య కార్యక్రమాలు దేశప్రేమతో కళకళలాడాయి.జిల్లా పోలీస్ అధికారులు పిల్లలతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించి, దాని చారిత్రక ప్రాధాన్యం, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అందించిన ప్రేరణను వివరించారు.“వందే మాతరం గీతం భారతీయులలో దేశభక్తి జ్వాలలు రగిలించిన ప్రేరణ గీతం. ఈ గీతం ప్రతి భారతీయుడిలో దేశసేవా భావం, త్యాగం, ఏకతను గుర్తుచేస్తుంది. యువత ఈ గీతంలోని ఆత్మను అర్థం చేసుకొని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి” అని ప్రకాశం పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు మరియు విద్యార్థులు కలిసి దేశభక్తి నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు.ఈ వేడుకల ద్వారా పోలీస్ శాఖ ప్రజల్లో దేశభక్తి, ఏకత, సేవా భావాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.