
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ తరపున ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు వర్షాల ప్రభావం కారణంగా నీటి మట్టం పెరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన చదలవాడ వాటర్ ట్యాంక్, హనుమాపురం వాగు, కోతకోట వాగు ప్రాంతాలను సందర్శించి, స్థానిక పరిస్థితులను పరిశీలించారు.నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో జరిగిన ఈ పర్యటనలో, ప్రజల భద్రత కోసం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు పొంగిపొర్లే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రజలకు సూచించారు.డీఎస్పీ గారు పోలీసు సిబ్బందికి తగిన ప్రికాషనరీ మెజర్స్ పాటిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.