
తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:-
పేద వలస కూలీలను గుర్తించి, వారికి గుర్తింపు కార్డులు అందించి స్వగ్రామాలకు చేర్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయం అని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు.శుక్రవారం కురిచేడు మండలం, ఆవులమంద పంచాయతీ పరిధిలోని రామాంజనేయ కాలనీలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారితో కలిసి ఆమె పర్యటించారు.ఈ కాలనీకి చెందిన 29 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, తెలకపల్లి గ్రామానికి వలస వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఎలాంటి ఆధారం లేని ఈ కుటుంబాలకు అండగా నిలుస్తానని డాక్టర్ లక్ష్మీ హామీ ఇచ్చారు.ప్రభుత్వ సహకారంతో వారిని గుర్తించి తిరిగి స్వగ్రామానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, అలాగే దళిత బహుజన సాధికార సంస్థ నాగమణి గారిని ఆమె అభినందించారు.వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ద్వారా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జనన సర్టిఫికెట్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సేవలు వంటి సంపూర్ణ సహాయం అందిస్తామని తెలిపారు.ఇలాంటి గుర్తింపు లేని వలస కూలీలకు సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.