
తొలి శుభోదయం పెద్దారవీడు :-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు , రోడ్ల పైన జరిగే ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వినూతన రీతిలో రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణలో మేము కూడా పాల్గొంటాం అవగాహన కల్పిస్తాం ప్రజల ప్రాణాలను కాపాడిన వారమవుతాం అంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రోడ్ సేఫ్టీ వారియర్స్ గ్రూపులు ఏర్పాటు చేసి తద్వారా ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తత కలిగించుటకు చేసిన చర్యల్లో భాగంగా శనివారం పెద్దారవీడు ఎస్సై వి సాంబశివయ్య, వారి సిబ్బంది మరియు పెదారివీడు మండల రోడ్ సేఫ్టీ వారియర్స్ సభ్యులు కలసి దేవరాజు గట్టునుండి భూ రెడ్డి పల్లి జంక్షన్ వరకు పెట్రోలింగ్ నిర్వహించి వాహనదారులకు రోడ్డుమీద ప్రయాణించే సందర్భాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, దాని వలన జరిగే నష్టాలను వాహనదారులకు వివరిస్తూ ప్రతి ఒక్క మోటార్ బైక్ నడిపే వ్యక్తులు మరియు వెనక కూర్చున్న వ్యక్తులు అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాల్లో ప్రయాణించాలని, అతివేగం ప్రమాదాలకు అతి చేరువకు తీసుకొని వెళుతుందని మిత వేగంతో ప్రయాణించాలని, రాంగ్ రూట్లో వెళ్లవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తగిన కౌన్సిలింగ్ వాహనదారులకు ఇవ్వడం జరిగినది మరియు ప్రజలలో రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్త చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించకపోతే ఆర్థికంగా శారీరకంగా మరియు ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని కుటుంబ ఆర్థిక వ్యవస్థలు కూడా పాడైపోతాయని ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి వాహనాలు సీజ్ చేయటం మరియు అధిక మొత్తంలో జరిమానాలు విధించడం జరుగుతుందని అందరూ జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఎస్సై వి సాంబశివయ్య వాహనదారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది…