
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా ఇంచార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలమేరకు వాహన ప్రమాదాల నివారణ కోసం గిద్దలూరు అర్బన్ సీ ఐ సురేష్ ఆధ్వర్యంలో ASI జిలాని మరియు పోలీస్ సిబ్బంది గిద్దలూరు పట్టణంలోని పలు సెంటర్లలో ప్రైవేట్ వాహనదారులు వాడుతున్న ఎల్ఈడి అధిక ఫోకసింగ్ లైట్లు తొలగించేలాగా అవగాహన కల్పిస్తూ, వాటి వాడకాన్ని తొలగించేలా చర్యలు తీసుకుంటున్న గిద్దలూరు అర్బన్ పోలీస్. రాత్రి సమయాల్లో హై వే లపై ప్రయాణించే ఎదురెదురు వాహన డ్రైవర్లు అధిక ఫోకస్ LED లైట్స్ వలన ఇబ్బంది పడి ప్రమాదాలకు గురికాకుండా గిద్దలూరు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.