
తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:-
దొనకొండ టౌన్లో ఘనంగా నిర్వహించిన శ్రీ విజయాంజనేయ స్వామి వారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం నరసింహా నాయని పాలెం గ్రామ టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ కార్యక్రమంలో, అలాగే దొనకొండ టౌన్ టిడిపి నాయకులు నిర్వహించిన పాట కచేరి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు , మాజీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు , దర్శి ఏఎంసీ డైరెక్టర్ శృంగారపు నాగసుబ్బారెడ్డి , టిడిపి నాయకులు బ్రహ్మయ్య, శిరిగిరెడ్డి బాలిరెడ్డి, నిమ్మకాయల సుబ్బారెడ్డి, దొనకొండ టౌన్ అధ్యక్షులు తోహిద్ గారు మరియు ఇతర నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.