
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కందుకూరు రోడ్ కూడలిలో నూతనంగా ప్రారంభించిన “రాజేష్ చిల్డ్రన్స్ హాస్పిటల్” వారు కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గవదగట్లవారి పాలెం చిన్నారులకు “శుభదిన్ భోజన్” పేరిట పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నదని, అదనంగా శుభదినాల్లో దాతల సహకారంతో పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు.అతను ఇంకా మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, అత్యవసర చికిత్సలు కూడా అందిస్తున్నామని వివరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, హాస్పిటల్ మేనేజర్ రోశయ్య, ఉపాధ్యాయులు అజయ్ చౌదరి, చైర్మన్ వాణి, పద్మ, రాధ, తల్లిదండ్రులు పాల్గొని డాక్టర్ రాజేష్ కి ధన్యవాదాలు తెలిపారు.