
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు కొండపి సబ్ ఇన్స్పెక్టర్లు ప్రభుత్వ హైస్కూల్, కొండపిలో విద్యార్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు Good Touch – Bad Touch గురించి వివరించి, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలో, అనుచిత ప్రవర్తన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల కారణాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన చర్యలు గురించి అవగాహన కల్పించారు.అదే విధంగా, పెరుగుతున్న ATM మోసాలు, సైబర్ మోసాలు గురించి కూడా విద్యార్థులకు వివరించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఎటువంటి అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ చట్టాలను గౌరవించాలని, తమ భద్రత తమ చేతుల్లోనే ఉందని గుర్తించాలన్నారు. భవిష్యత్ పౌరులైన విద్యార్థులు చట్టపరమైన అవగాహనతో బాధ్యతాయుతంగా ఎదగాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు విద్యార్థుల భద్రత, భవిష్యత్ రక్షణ దిశగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు.