
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి పోలీస్ :-
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు మరియు వారి రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కనిగిరి మరియు కంభం పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. కనిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పోలీసులు, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఈవ్ టీజింగ్ మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అపరిచితులతో చాటింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.అదేవిధంగా, కంభంలోని రంగరాజు హైస్కూల్లో చిన్నారి విద్యార్థులకు "గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్" (సురక్షితమైన మరియు అసురక్షితమైన స్పర్శ) పై అవగాహన కల్పించారు. ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఎలా స్పందించాలి, వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు ఎలా తెలియజేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100, శక్తి యాప్ మరియు దిశ యాప్ ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందాలో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.